Teachers from the Sanctuary Schools spent the lock down period reading the book “Divaswapna” by Gijubhai Bahedka, “Pagati Kala” in Telugu.
We share below some reflections from our teachers.
Ademma S
Ademma, reflecting on what she understood of the book, how it relates to our schools and our lives today and also shares what she thinks education/ teaching should be. (Excerpt from the last chapter).
- గీజు బాయి అంటున్నాడు ముందు ప్రపంచ స్వారుపం ఇలా ఉండేది కాదు, ఇంగ్లీసు వారు మన దేశంలో కొత్త కొత్త ప్రయోగాలు చేశారు, ఇంకా మనుసులు కూడ మన దేశన్ని నాశనం చేస్తున్నారు.
- ఆయన చెప్పినట్టే నిజంగా మనుసులు ప్రాపంచాన్ని మార్చినారు ఎలా అనగా ముందు అయితె నీల్లు బూమి పైబాగన్న ఉండేది చెరువులు,కుంటలు, బావూలు నిండుగా నీల్లు ఉండేవి ఎక్కడ చూసిన నీల్లు పోతూండేది.
- అడవిలో కూడ నీలు ఎక్కడ చూసిన ఉండేవి, ఏటిలో కూడ నీల్లు పోతూండేది, అప్పుడు జీవరాసులు, పాక్షిలు నీల్లుతాగుతు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అయితే జీవరాసులు అంతగా కనిపించేది కాదు,
- అడవిలొ నీల్లు లేవు మనుసులు బోర్లు వేయడం వలన నీల్లు అన్ని అందులోకి వెల్లిపోయాయి, బావులు,చెరువులు, ఎండిపోయాయి, మనుసులు అడవిలోని చెట్లను నరకి ఇండ్లకోసం ఇంక రక రకల పనిముట్లకోసం ఉపయోగిస్తున్నారు, అందువలన వర్సలు తగ్గీపోయయి.
- సెల్ పోన్ టవర్స్ పెద్ద పెద్ద ప్యాక్టిరిలు కట్టాడం వలన అందులోని పొగ ఆకశంలోకి పోతుంది పక్షిలకు ఆని కలుగడం వలన చాలపక్షిలు చనిపోయయి.
- అప్పుడు పంటలు చేసెటప్పుడు పంటలకు ఎరువులు చల్లేవారు, ప్రజలకు రోగాలు అంతగా ఉండేది కాదు, ఇంకాఆ పంటలను తినటానికి పురుగులు,ఎలుకలు వచేవి వాటిని తినటానికి పక్షిలు, పాములు వఛెవి, వాటిని తినటానికి డేగలు,గ్రద్దలు వచేవి ఇలా ఒకదాని మీద ఒకటి ఆదరపడి జీవించేవి.
- ఇప్పుడు పంటలకు రక రకల మందులు చెల్లడం వలన మనుసులకు రోగాలు వస్తున్నాయి పక్షీలు కీటకాలు తగ్గి పోయాయి.
- గీజుబాయి చెప్పినట్టె మనం కూడ పిల్లలకు ఎదైన కొత్తవిశం చెప్పాలి. మనం బ్యెంగులూరు మ్వూజియంకు వెల్లినాము అలాగే పిల్లలను ఇంకా కొత్త చోటికి తీసుకోని వెల్తె వాలు ఆనందంగా చూస్తరు, కాని కరోన రావడం వలన మనము ఎక్కడకు వెల్లలేము, కరోన ఎక్కడ లేకుండా దేశంలో నుండి వెల్లిపోతే మనం పోవఛు.
- గీజుబాయి పిల్లలకు స్వేఛ అనురాగంతో వాల్లను కొట్టకుండ తిట్టకుండ నేర్పడు మనం కూడపిల్లలకు అలానే నేర్పెంచాలి.
- కేవలం డబ్బు కోసం మాత్రం చదువు చెప్పడంకా కాదు దానికి తగ్గట్తు పలితం కూడ ఉండాలి.
P Jayapalappa
Jayapal shares his understanding of how the author conducts a cultural program and in this audio podcast, talks about how such an event can help a teacher in imparting language instruction, particularly grammar.Reflections from Jayapalappa
Jyothi T
Teacher class lo భొదించే ముందు తాను స్యయంగా ఆచరించి దాని ఫలితం చూచి తరువాత భొదించాలి. తరగతిలొ పిల్లలందరు ఒకే విధంగా వుండరు. ఒకోక్కరి ఆసక్తి, ఆలోచనా విధానం ఒకోక్క విదంగా వుంటుంది. teacher మొదట పిల్లలందరి మనొ భావాలను తెలుసుకోవాలి. మొదట వారితో బాగా మాట్లాడించాలి. వారికి టీచర్ బాగా దగ్గరవ్వలి. పాఠశాల అన్న క్లాసులు అన్నా పిల్లల్లొ భయం పోగొట్టాలి. పిల్లలు ఇష్టంగా పాఠశాలకు రావడానికి అవసరమైన విధంగా టీచర్ వుండాలి.పిల్లల ఇష్టాన్ని గుర్తించి classlo teacher plan చేసుకోవాలి. పరిశుభ్రత గురించి రోజు పిల్లలకి చెప్పాలి .పిల్లల్లొ ఆలోచించే శక్తిని పెంపోందించాలి. రోజు చెపిందె చేప్పి బోర్ కొటించకుండ రోజు ఒక ఆసక్తికర కొత్త కొత్త విషయలు భోదించాలి .పిల్లలకి కథలు చెప్పి కథలొని సన్నివేశాలు ఆలోచించే విధంగా వుండాలి .పిల్లల్లే సోంతంగా కథలు చదివే విధంగా ప్రోత్సహించాలి. అప్పుడప్పుడు పాఠశాల యందు తల్లిదండ్రుల సమావేశం పెట్టి టీచర్ భోదనా విదానం గురించి పరిశుభ్రత గురించి వారికి అర్థమయ్య విదంగా చెప్పాలి. పిల్లలకి ముఖ్యంగా గ్రంధాలయం వుండాలి
ప్రతిరోజు క్లాసులో జరిగే కార్యక్రమాల గురించి టీచర్ డైరీలో వ్రాసుకుంటే బాగుంటుంది. డైరీవల్ల ఉపయోగం చాల వుంది. దీనివల్ల టీచర్ ముందు ఎమి చేప్పినాము ,ఇంక ఏమి చేప్పాలి అనేది తెలుస్తుంది. వ్రాయడంలొ తప్పు ఒప్పులు ,పాస్ పెయిలు చెప్పకుడదు.ఎవరి తప్పులను ఎంచకుడదు. మన అనే భావన పిల్లల్లో కలిగించాలి. ప్రతి పిల్లవాడు వినేవిదంగా చూడాలి .పిల్లల్ని కొట్టి తిట్టి చదువు చెప్పకుడదు. పిల్లవానికి ఎంత చెప్పిన జ్ఝాపకం వుండదు అనేది తప్పు ,చదువులో జ్నాపకం లేకపోయిన ఇతర విషయాలలో అతడు చురుక్క వుంటాడు. పిల్లలు ఒక క్రమ పద్దతిని పాటించే విదంగా ఉండాలి. పిల్లలకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు గ్రందాలు తెలియని విషయాలు చేప్పకూడదు, మంచి మంచి నాయకులు, ఆదర్స జీవిత చరిత్రలు చెప్పవచును. ఉదా;మదర్ తేరీసా ,వివేకానంద, అర్దవంతమైన కథలు చేప్పి ప్రశ్నోత్తర రూపంలో ఉండేవిదంగా చూడాలి.
Satheeswar
Satheeswar shares his understanding of the book and what struck him as the role of a teacher and a teacher’s attitude and the kind of attention a teacher needs to pay to the students’ habits and ways of behavior.Reflections from Satheeshwar